నేరేడుచర్ల, జూన్ 26 : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల జడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థులు ఐదుగురు గణితశాస్త్రంలో 92 మార్కులకు పైగా సాధించారు. వీరికి ఆ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కొణతం వెంకట్రెడ్డి తన తండ్రి సత్యనారాయణ రెడ్డి జ్ఞాపకార్ధం ఒక్కో విద్యార్థికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.50 వేలను పాఠశాల హెచ్ఎం బట్టు మధు చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షల ముందు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచి చైతన్య పరిచి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ నగదు బహుమతి ప్రకటించినట్లు తెలిపారు.
నగదు బహుమతిని అందజేసిన ఉపాధ్యాయుడు వెంకట్రెడ్డిని అభినందించారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరబాబు, సైదులు, రసీద్ ఖాన్, జానకిరాములు, అన్నపూర్ణ, నర్సింహరావు, నాగమణి, మాధవి, వెంకటేశ్వర్లు, బానుమతి, జానయ్య, యాదగిరి, రాంమ్మూర్తి, బాలు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసరావు, సరస్వతి, నగేశ్ పాల్గొన్నారు.