కోదాడ, ఆగస్టు 24 : పుస్తక దానం మహా దానమని కోదాడ ప్రాథమిక పాఠశాల హరిజనవాడ ప్రధానోపాధ్యాయుడు చిగురుపాటి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాపారవేత్త ఆగీరు మధు పుట్టినరోజును పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల విద్యకు చేయూతనందిస్తున్న ట్రస్ట్ సేవలను కొనియాడారు. రూ.3 వేల విలువ గల నోట్ పుస్తకాలు, స్టేషనరీ అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ జనరల్ చారగుండ్ల ప్రవీణ, రాజశేఖర్, ట్రస్ట్ కోఆర్డినేటర్ వెంపటి వెంకటరమణ, దేవరశెట్టి శంకర్రావు, ట్రస్ట్ పి అర్ ఐ చీదేళ్ల హనుమంతరావు, గరినే శ్రీనివాసరావు, చిట్టిప్రోలు నారాయణ, స్వర్ణ భారతి స్వయంసేవ సభ్యులు చల్లా అశోక్, ఎర్ర శ్రీనివాసరావు, బెలీదే అశోక్ పాల్గొన్నారు.