సూర్యాపేటటౌన్, జూలై 5: గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ 2.8 లక్షల విలువైన 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈకేసులో నిందితులైన కోదాడ మండలం దొరకుంట గ్రామానికి చెందిన అడపా రాకే శ్, కోదాడలోని శ్రీరంగాపురానికి చెందిన వనపర్తి సాయిలును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు.
రాకేశ్ ఇంటర్ చది వే సమయంలో గంజాయికి అలవాటు పడ్డాడు. అనంతరం ఆర్థిక పరిస్థితులు బాగోలేక చదువుకు స్వస్తి పలికి ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 2023లో కోదాడ రూరల్ పోలీసులు రాకేశ్ వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకొని జైలుకు పంప గా శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. పది రోజుల క్రితం కేసు వాయిదా కోసం కోదాడ కోర్టుకు రాగా అక్కడ ఒడిశా నుం చి వచ్చిన ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.
అతడు కూడా గంజాయి కేసు వాయిదాపై వచ్చినట్లు తెలుసుకొని రాకేశ్ తనకు గం జాయి కావాలని అడగ్గా జూన్ 29న ఒడిశాలోని కలిమెళ్ళలో శివ మందిర్ వద్దకు రమ్మని చెప్పాడు. అతడు చెప్పినట్లుగా రాకేశ్ అక్కడకు వెళ్లి 11 కిలోల ప్యాకెట్లు ను రూ.11 వేలకు కొనుగోలు చేసి జూన్ 30న దొరకుంటకు చేరుకున్నాడు. గంజాయిని దొరకుంట గ్రామ శివారులోని ఇండస్ట్రియల్ ఏరియాలోని చెట్టు పొదల్లో దాచి ఉంచాడు.
ఈనెల 2న గంజాయి కొనుగోలు చేసే వనపర్తి సాయికుమార్‌కు ఫోన్ చేసి తాను ఒడిశా నుంచి గంజాయి తెచ్చిన విషయం చెప్పాడు. దీంతో సాయికుమార్ ఈనెల 4న గంజాయి కొనుగోలు చేసేందుకు రాగా అదే సమయంలో పోలీసులు కాపుగాసి వారిని అరెస్టు చేశారు. రాకేశ్ వద్ద 5 ప్యాకెట్లు 9 కిలోలు, ఒక సెల్‌ఫోన్, సాయి వద్ద 925 గ్రాముల గం జాయి ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమో దు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేసి న సీఐ రజితారెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్‌రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ హరికృష్ణ, సీసీఎస్ సిబ్బంది శ్రీనివాస్, కరుణాకర్, ఆనంద్, మల్లేశ్, సతీశ్, శివకృష్ణ, ప్రభాకర్, మహిళా హోం గార్డు మంజుల, ఎస్బీ సిబ్బంది జాని, లక్ష్మయ్య, కోదాడ రూరల్ పీఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ లింగరాజు, ప్రవీణ్‌ను ఎస్పీ అభినందించారు.