సూర్యాపేట టౌన్, జూన్ 20: సాధారణ ప్రసవాలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూర్యాపే ట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానను శుక్రవారం సందర్శించి మాట్లాడారు. సదరం క్యాంపు నిర్వహించేటప్పుడు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వసతులు కల్పించాలని సూచించా రు. ప్రతిరోజూ వచ్చే రోగుల వివరాలు, జ్వరంతో దవాఖానకు వచ్చే వారికి వైద్య సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధం గా ఉండాలన్నారు.
దవాఖానకు వచ్చే వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధు లు వచ్చే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఎంసీహెచ్ సెంటర్ భవనాన్ని సందర్శించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. డీ అడిక్షన్ సెంటర్ కోసం స్థలం సేకరించాలని సూ చించారు.
అత్యవసర వార్డు, టీబీ యూనిట్ వార్డు, జెరియాట్రిక్ కేర్ వార్డు, డేకేర్, కీమోథెరపీ వార్డు, జ్వరం, కొవిడ్ ఐసోలేషన్ వార్డులను పరిశీలించి వైద్య సేవ లు, మందులు ఇస్తున్నారా లేదా అని పేషంట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతినెలా బ్లడ్ టెస్టుల వివరాలు, రిజిష్టర్లో నమోదు ను పరిశీలించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్లో మందుల లభ్యత గురిం చి ఆరా తీశారు. అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. దవాఖానలో పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేస్తూ పరిసర ప్రాం తాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఆర్ఎంవో వినయ్ఆనంద్, డాక్టర్ లక్ష్మణ్, అధికారులు ఉన్నారు.