రామగిరి, సెప్టెంబర్ 09 : సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ, దివంగత సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభను నల్లగొండ పట్టణం దేవరకొండ రోడ్లో గల జీఎల్ గార్డెన్స్‌లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాలు & సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి హాజరు కానున్నట్లు వెల్లడించారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ పాల్గొనాల్సిందిగా ఆయన కోరారు.