బీజేపీ కుట్రలను సాగనివ్వం
మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్న బీజేపీ కుట్రలను సాగనివ్వమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మహిళా నాయకురాలి ఇంటిపై దాడికి యత్నించిన బీజేపీ నాయకులకు సిగ్గు లేదని మండిపడ్డారు
- ఎమ్మెల్సీ కవితకు సంఘీభావం తెలిపిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
యాదాద్రి, ఆగస్టు 28 : మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్న బీజేపీ కుట్రలను సాగనివ్వమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మహిళా నాయకురాలి ఇంటిపై దాడికి యత్నించిన బీజేపీ నాయకులకు సిగ్గు లేదని మండిపడ్డారు. దాడి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఎవ్వరెన్ని కుట్రల పన్నినా తెలంగాణ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారన్నారు. ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీ కవితకు తమ పూర్తి మద్దతును ఉంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌తోనే 8 ఏండ్లుగా రాష్ట్రంలో శాంతియుత, మానవీయమైన పాలన సాగుతున్నదని తెలిపారు. విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం పనిచేస్తున్నదని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి కొట్లాడటం కొత్తకాదని, దాష్టీకాలకు పాల్పడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Attack
- BJP
- Mlc Kavitha
- Slam
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

