కట్టంగూర్, మే 13 : ప్రజా సమస్యలపై సమరశీల పోరాటం చేయడమే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకు మనమిచ్చే నివాళి అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఎం కట్టంగూర్ మండల కార్యదర్శి పెంజర్ల సైదులు అన్నారు. సోమవారం కట్టంగూర్ పార్టీ కార్యాలయంలో సుందరయ్య వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుడుగుంట్ల రామకృష్ణ, సైదులు, ఒక్కయ్య, రమేశ్, ముస్కు రవీందర్, సైదులు, నర్సింహ్మ, వేముల వెంకన్న, చిలుకూరి సైదులు పాల్గొన్నారు.