నల్లగొండ, డిసెంబర్ 05 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని, బరిగీసి కొట్లాడాలని బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలో ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ కల్పించలేదని ఒంటిపై పెట్రోల్ పోసుకుని సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్యకు పాల్పడడం విచారకరమన్నారు. ఈశ్వర్ చారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. బీసీలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని చూడడం దురదృష్టకరమన్నారు. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సంఘటన హేయనీయమన్నారు. సర్పంచ్ అభ్యర్థి భర్తపై దాడి చేసిన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు పసుల కాశీ యాదవ్, అంబటి శ్రీనివాస్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.