కట్టంగూర్, ఆగస్టు 12 : కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులు రైతు బంధుతో పాటు యాంత్రీకరణ పరికరాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కట్టంగూర్ మండల వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్ తెలిపారు. కట్టంగూర్ రైతు వేదికలో మంగళవారం రైతుల నుంచి రైతుబంధు దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బంధుకు ఈ నెల 12న, యాంత్రీకరణకు 15 చివరి తేది అని, ఆసక్తి గల రైతులు దరఖాస్తులను ఏఈఓలకు అందజేయాలని సూచించారు.
అలాగే వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతు యంత్రలక్ష్మీ కింద సన్న, చిన్న కారు రైతులకు 50 శాతం, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీపై పరికరాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. స్ర్పేయర్స్, టాక్టర్ సంబంధించిన కల్టివేటర్లు, ప్లవ్ లు, వీల్స్, రోటవేటర్స్ పనిముట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ నిరంతర పక్రియ అని, రైతులు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ లతో ఏఈఓలను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ పరశురాములు, నవీన్ పాల్గొన్నారు.