నిడమనూరు, మార్చి 23 : మండల కేంద్రం లోని మండల పరిషత్ కాంప్లెక్స్ భవనం లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ప్రైవేట్ భవనంలో కొనసాగిన కార్యాలయం ప్రభుత్వ ఆదేశాలతో కాంప్లెక్స్ భవనంలోకి పూర్తి స్థాయిలో తరలించి సేవలను ప్రారంభించారు. ఒకవైపు పోలీస్ స్టేషన్ భవనంలో కొనసాగుతుండగా తాజాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రెండో వైపు ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఉపయోగకరంగా మారనుంది. ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలోకి నూతనంగా కార్యాలయం చేరడంతో ప్రజలకు ఉపయోగకరం కానుంది. నిడమనూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ శేషరాజు సంధ్యాశ్రీనివాస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ దేవానంద్, ఉప సర్పంచ్ శేషరాజు లక్ష్మి నరేశ్ దాసు, సిబ్బంది మహేందర్, ఉస్మాన్, వీరేపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.