జహీరాబాద్, జూలై 22 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ పీఎస్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ సీవీ. ఆనంద్‌ను మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ జహీరాబాద్ పట్టణం విస్తరించడంతో పాటు విద్యాసంస్థలు, పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు. పట్టణ పరిసరాల్లో జనాభా కూడా పెరిగి ట్రాఫిక్ సమస్యతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. శాంతి భద్రత దృష్ట్యా జహీరాబాద్ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతాప్రభాకర్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఈదులపల్లి శివకుమార్ ఉన్నారు.