హనుమకొండ, జూలై 22 : కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసే పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ మీ వెంటే ఉంటుందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ బర్త్‌డే సంద ర్భంగా దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి అధ్యక్షతన బుధవారం హనుమకొండలో నిర్వహించిన కేటీఆర్ నిరుద్యోగ భరోసా ఉచిత ఆన్లైన్ కోచింగ్ శిక్షణలో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి యాప్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవు తున్నా మూడు వేల ఉద్యోగాలు ఇవ్వలేదని, మాయమాటలతో నిరుద్యోగుల ఓట్లు దండుకున్నదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌తో పోరాడి తెలంగాణ ఏర్పాటు అనంతరం వాటిపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, నీటి కోసం అనేక ప్రాజెక్టులు కట్టారని, నిరుద్యోగుల కోసం 1.65 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించారని, అందుకుగాను మాజీ మంత్రి కేటీఆర్ వరంగల్, కరీంనగర్ లాంటి టూ టైర్ సిటీలకు ఐటీ కంపెనీలు తీసుకొచ్చారన్నారు. ఈ యాప్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ కార్యాలయం జనతా గ్యారేజీగా ఉంటుందని, ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా రావచ్చన్నారు. వాసుదేవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముం దు ఉన్న పరిస్థితులే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కనిపిస్తున్నాయన్నారు. సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ సమన్యాయం చేశారన్నారు. అనేక ప్రాజెక్టులు కట్టారని, ఉద్యోగాలు ఇచ్చారన్నారు. నిరుద్యోగుల ఓట్ల కోసం కాంగ్రెస్ ఎన్నికల ముందు మోసపూరిత వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిందన్నారు.
విన్నర్స్ ఆన్లైన్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో నిర్వహిస్తు న్న కేటీఆర్ నిరుద్యోగ భరోసా ఉచిత ఆన్లైన్ కోచింగ్ యాప్ శిక్షణ తరగతులను వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 24న కేటీఆర్ బర్త్‌డేను పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేశ్, సిరంగి సునీల్, ఇమ్మ డి లోహిత, కేయూ మాజీ విద్యార్థి సంఘం నాయకుడు కే సైదిరెడ్డి, యూత్ నాయకులు వీరేంద ర్, శరత్శంద్ర, కేయూ విద్యార్థి సంఘాల నాయకులు బైరపాక ప్రశాంత్, వీరస్వామి, మనోజ్, బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి, బండి రజిని, శ్రీధర్, ఇమ్మడి రాజు, చిన్న, వినిల్రావు, విద్యా ర్థి ఉద్యమకారులు, నాయకులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు అండగా బీఆర్ఎస్ : అరూరి
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. తాము 1.65 లక్షల ఉద్యోగాలిచ్చినప్పటికీ ఏ రోజు చెప్పుకోలేదు. అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేస్తూ సీఎం ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎం చేస్తున్న మోసాన్ని నిరుద్యోగ యువత నిలదీయాలి. ఇటీవల కేటీఆర్ నిరుద్యోగుల కోసం నిర్వహించిన యువ సంగ్రామ సదస్సు విజయవంతమైంది. ఈ ఉచిత శిక్షణ యాప్‌ను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలి.
నిరుద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు : గండ్ర
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2 కోట్లు ఉద్యోగాలని పన్నేండేళ్లు అయ్యింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మూడేళ్లు కావొస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి నియంతతృత్వ పాలన చేస్తున్నా డు. నిరుద్యోగులు, రైతులు మాట్లాడితే ఆంక్షలు విధిస్తూ లాఠీచార్జి చేస్తూ కేసులు పెడుతున్నారు. నీట్ పరీక్ష పత్రం లీకేజీ విషయంలో ఢిల్లీలో విద్యార్థులు, యువత నిరసన తెలుపుతుంటే బీజేపీ ప్రభు త్వం లాఠీచార్జి చేయడం బాధాకరం. గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంటే రేవంత్‌రెడ్డి నిద్రపోతున్నా డు. వ్యవసాయ రంగానికి నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పిన రాహుల్‌గాంధీ 31 నెలలుగా వారిని పట్టించుకో వడం లేదు. ఏ వర్గానికి అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.