రామగిరి, డిసెంబర్ 23 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై వర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ ఆధ్వర్యంలో విద్యార్థులు కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మార్గమధ్యంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్ వంటి హామీలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధి నాయకులు శివకుమార్ పోలగోని, అశోక్ కోటేశ్, సుదీర్, మల్లేశ్, లావణ్య, మహేశ్వరీ, మానస పాల్గొన్నారు.