త్రిపురారం, జూన్ 21 : ఆంగ్ల విద్యపై విద్యార్థులు పట్టు సాధించాలని త్రిపురారం ఎంఈఓ రవి అన్నారు. శనివారం మండలంలోని పెద్దదేవులపల్లి ఉన్నత పాఠశాలలో ఎస్ సేవా ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకు అందించిన డిక్షనరీలు, పెన్నులు, స్టేషనరీ సామగ్రిని విద్యార్థులకు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దాతల సహాయం మరువలేనిదన్నారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకు సంబంధించిన కంప్యూటర్లు, రీడింగ్ చైర్స్ అందించాలని కోరారు. సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం రామారావు, లక్ష్మయ్య, మధుసూదన్, దయాకర్, మల్లారెడ్డి, బిస్మిల్లా పాల్గొన్నారు.