కట్టంగూర్, ఆగస్టు 13 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాల హెచ్ఎం కందాల రమ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీలను బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహ దారుఢ్యం పెంపొందుతుందన్నారు. గెలుపోటములు సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తి చాటాలని సూచించారు. క్రీడా బహుమతుల దాత పగిల్లపల్లి భిక్షంను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎడ్ల పద్మరాములు. ఉపాధ్యాయులు శ్రీనివాస్, నరహరి, నగేశం, సంపత్, లింగయ్య, పీఈటీ చింతకాయల పుల్లయ్య పాల్గొన్నారు.