త్రిపురారం, జూలై 16 : విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని త్రిపురారం ఎంపీడీఓ కునిరెడ్డి విజయకుమారి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన మినీ గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్ను పరిశీలించడంతో పాటు స్టోర్ రూమ్లో కూరగాయలు, గుడ్లు, నిత్యావసర వస్తువులను పరిశీలించారు. నిత్యావసర సరుకులు ఎప్పటివి అప్పుడే తెచ్చుకోవాలన్నారు. బియ్యంలో మట్టిపెల్లలు, పురుగులు, మెరిగలు లేకుండా జల్లి పట్టించి వండాలన్నారు. పాఠశాలలో ఉన్న ఆర్ఓ ప్లాంట్ నీళ్లను వంటకు వాడాలన్నారు.
పాఠశాల ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, వర్షాకాలం సీజన్లో దోమలు, ఈగలు ఎక్కువగా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ఉన్నతాధికారులకు తెలియచేయడం జరుగుతుందన్నారు. విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతివారం పీహెచ్సీ నుంచి వైద్య సిబ్బంది వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట గురుకుల పాఠశాల ఎస్ఓ భారతి, జూనియర్ అసిస్టెంట్ మహేశ్ ఉన్నారు.
Tripuraram : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : ఎంపీడీఓ విజయకుమారి