కట్టంగూర్, ఆగస్టు 06 : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, నాణ్యమైన విద్య అందించాలని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధారెడ్డి అన్నారు. బుధవారం కట్టంగూర్ కసూర్భాగాంధీ గాంధీ బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, స్టోర్ రూం, వంటశాల, భోజనంతో పాటు నిర్మాణంలో కళాశాల భవనాన్ని పరిశీలించి మాట్లాడారు. కళాశాల భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పాఠశాల పరిసరాలతో పాటు మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఉపాధ్యాయులు భోదించే పాఠాలను విద్యార్థులు ఏకాగ్రతతో విని పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలన్నారు. పాఠశాలలో వంద శాతం ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి రాత్రి బస చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట జీసీడీఓ అరుంధతి, ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య, కేజీబీవీ ప్రత్యేక అధికారి నీలాంబరి, ఉపాధ్యాయులు ఉన్నారు.