కట్టంగూర్, సెప్టెంబర్ 08 : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నల్లగొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు శశికళ అన్నారు. సోమవారం రాత్రి కట్టంగూర్ లోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి భోజనం, రికార్డులను పరిశీలించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు దుప్పట్లు అందజేశారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డెన్‌కు సూచించారు. విద్యార్థులు ఇష్టంగా చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఆమె వెంట ఏఎస్డబ్ల్యూఓ స్వామి, వసతి గృహ సంక్షేమ అధికారి గుజ్జుల శంకర్‌రెడ్డి, సిబ్బంది నర్సింహ్మ, వెంకట్ రెడ్డి ఉన్నారు.