నల్లగొండ విద్యావిభాగం (రామగిరి), ఏప్రిల్ 10 : నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్స్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం యూనివర్సిటీ హాస్టల్స్ డైరెక్టర్ డాక్టర్ దోమల రమేశ్‌కు ఏబీవీపీ, ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూనివర్సిటీ హాస్టల్స్ లో తాగునీరు, క్లీనింగ్ సక్రమంగా లేదని, నూతన మెస్ బిల్డింగ్‌లో సైతం సమస్యలు ఉన్నట్లు హాస్టల్ డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతూ అనారోగ్యానికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ ఏబీవీపీ అధ్యక్ష కార్యదర్శులు హనుమాన్, మోహన్, నాయకులు ఛత్రపతి, విజయ్, వెంకట్, ప్రత్యూష, శ్రీ నందిని, తరుణ్, సాయి, వెంకట్, మహేశ్ పాల్గొన్నారు.