రామగిరి, నవంబర్ 6: ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎంజీ యూ పరిధిలోని అన్ని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలు, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో కళాశాలల నిరవధిక బంద్ చేపట్టారు. సోమవారం నుంచి తరగతులతోపాటు కళాశాలలను కూడా బంద్ చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాజమాన్యాలు బంద్‌లో పాల్గొంటూ ఆయా కళాశాల ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్య పరిషరించే వరకు బహిషరణ కొనసాగుతుందని ఎంజీయూ టీపీడీపీఎంఏ, ఎంజీయూ ప్రైవేట్ బీఈడీ కళాశాలల అసోసియేషన్, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. దీంతో 4వ రోజు బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భం గా ఆయా కళాశాలల యాజమాన్యాల బాధ్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల ఆధ్వర్యంలో బంద్ చేపడుతున్నట్లు తెలిపారు.
బం ద్లో నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్, రాష్ట్ర నాయకులు మారం నాగేంద్రారెడ్డి, కాకతీయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి, డీవీఎం, అరబిందో, అల్ మదీనా, గోకు ల్, కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ నారాయణరెడ్డి, సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి, మేడిపల్లి రవి, సరిత, శ్రీదేవి, పుష్పాంజలి, సూపరింటెండెంట్ సొల్లేటి శ్రీధర్ చారి, తాటి శ్రీనివాస్, అహ్మద్ హుస్సేన్, శరత్ చంద్ర, సిద్ధిఖీ, సిద్ధార్థ డిగ్రీ కళాశాల అకడమిక్ డైరెక్టర్ గుండబోయిన జానయ్య యాదవ్, చైర్మన్ లింగయ్య, ఆయా కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.