నల్లగొండ రూరల్, జూలై 8: ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల ల్లో రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.అయినప్పటికీ ప్రభుత్వం విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నల్లగొండ మండలంలోని ముశంపల్లి గ్రామంలో ఇటీవల అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో హ్యాండ్ వాష్‌తో పాటు తాగు నీరు, మరుగుదొడ్లు ఏర్పా టు చేశారు.
అయితే అవి మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. ముశంపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాగు నీటి సౌకర్యం లేక విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో ఇంటి నుంచి తెచ్చుకున్న వాటర్ బాటిళ్లతో కనిపించారు. అదేవిధంగా జడ్పీహెచ్ఏస్లో మధ్యాహ్న భోజన సమయంలో అన్నం తిన్న అనంతరం బాలికలు తమ పేట్లను,చేతులను శుభ్రం చేసుకోవడానికి హ్యాండ్ వాష్, ట్యాప్‌లు లేకపోవడంతో సమీపంలోని నీటి హౌజ్‌లో చేతులు, ప్లేట్లు శుభ్రం చేసుకుంటున్న దృశ్యం నమస్తే తెలంగాణ కెమెరాకు చిక్కాయి. ఈ విషయమై సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులను వివరణ కోరగా పాఠశాలలో తాగు నీటి సమస్య ఉందని, అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.