కట్టంగూర్, ఆగస్టు 6: సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్
అన్నారు. మండల కేంద్రంలోని సాందీపని పాఠశాలలో విద్యార్థులకు బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ ద్వారానే 80 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న సాంకేతికను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
విద్యార్థులు అవగాహన పెంచుకుని ఇటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా జాగృతం చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పోగుల రాములు, పోలీసు సిబ్బంది వెంకన్న, సతీశ్, దుర్గాప్రసాద్, గంట శంకర్, శ్రీను, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.