కొండమల్లేపల్లి , జూన్ 15 : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీధర్ నిర్లక్ష్యం వల్ల నాంపల్లి మండలం బండ తిమ్మాపురం గ్రామానికి చెందిన రామ్ చరణ్ విద్యుత్ షాక్‌కు గురైనట్లు బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ తెలిపారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని సంజీవ ఆస్పత్రిలో విద్యుత్ షాక్‌తో చికిత్స పొందుతున్న విద్యార్థిని బీఆర్ఎస్వీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రామ్ చరణ్‌కి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు జమీర్ బాబా, అనిల్ పాల్గొన్నారు.