రామగిరి, జూలై 06 : విద్యతో పాటు క్రీడాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించాలని, ఆదిశగా ఎంజీయూలో క్రీడా మైదానాలు అందుబాటులో ఉంచినట్లు ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి తెలిపారు. ఎంజీయూ ఆర్ట్స్ బ్లాక్ సమావేశ మందిరంలో సోమవారం ఎంజీయూ, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, డీపీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్స్, పీడీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం వర్సిటీ నిర్వహించే వివిధ రకాల క్రీడాల్లో ఆయా కళాశాలల నుండి విద్యార్థుల భాగస్వామ్యం పెంచేలా కృషి చేయాలన్నారు.
అదే విధంగా వర్సిటీలో నిర్వహించే బయూటీ, ఐటీసీ క్రీడల్లో చేర్చాల్సిన గేమ్స్ పై సుదీర్ఘంగా చర్చించి పలు అంశాలను ఆమోదించారు. ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ డా. హరిష్ కుమార్ మాట్లాడుతూ.. వర్సిటీలో త్వరలోనే నిర్వహించే క్రీడల జాబితాలను విడుదల చేస్తామన్నారు. ఆ దిశగా విద్యార్థులను సిద్ధం చేసి యూనివర్సిటీ, అంతర యూనివర్సిటీ, జాతీయ స్థాయిలో మన విద్యార్థులు సత్తా చాటేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ స్టోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డా.వై.శ్రీనివాస్ రెడ్డి. డా.ఆర్.మురళీ, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, పీడీలు పాల్గొన్నారు.
మై భారత్ సంస్థ చేపట్టిన వికసిత్ భారత్‌లో విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకుని భాగస్వామ్యం కావాలని రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి సూచించారు. దానికి సంబందించిన పోస్టర్‌ను సోమవారం వర్సిటీలోని తాన చాంబర్లో ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.నరం వెంకటరమణారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ఆఫీసర్ గౌతమ్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ పీవోలు కట్టకిరణ్, డా.శ్రీనివాస్, డా.విజయ్ కుమార్, డా.రామచంద్రుడు, డా.శ్రీధర్‌రావు, శ్రీనివాస్, రమేష్ నాయక్ పాల్గొన్నారు.

క్రీడల్లో విద్యార్థుల భాగస్వామ్యం పెంచాలి : ఎంజీయూ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి