కోదాడ, మే 14 : కోదాడ మున్సిపాలిటీ పరిధిలో 26వ వార్డు అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆ వార్డు కౌన్సిలర్ నేహా నాజ్ బషీర్ అన్నారు. గురువారం వార్డులో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సొంత ఖర్చులతో వాటర్ ట్యాంకర్ ను ఏర్పాటు చేసి మైనార్టీ కార్పొరేషన్ స్టేట్ వైస్ చైర్మన్ జబ్బార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ లతో కలిసి ప్రారంభించారు. వార్డు ప్రజలకు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తానన్నారు. వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. వార్డులో ప్రతి ఇంటికి ఉచితంగా మంచి నీరు సరఫరా చేస్తామన్నారు.
మైనార్టీ కార్పొరేషన్ స్టేట్ వైస్ చైర్మన్ జబ్బర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ లు మాట్లాడుతూ.. కౌన్సిలర్ నేహా నాజ్ వార్డు ప్రజల కోసం సొంత ఖర్చులతో వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. వార్డు అభివృద్ధికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎం కాజా, ఫ్రూట్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబా, చాంద్ పాషా, ముస్తఫా, గన్నేమియా, ముక్తి హతహర్, శ్రీరంగం ప్రమీల, కాసర్ల రాజు, మైనార్టీ నాయకులు బాగ్దాద్, భాయిజాన్, ఘోర, నసీర్, టిల్లు, నిస్సార్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.