రామగిరి, అక్టోబర్ 28 : విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సమగ్ర వికాసానికి కథలు ఎంతగానో దోహద పడతాయని పిల్లల కథా రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ మర్రిగూడ ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు మండలంలోని గుట్టకింది అన్నారం ప్రాథమిక పాఠశాలకు తాను రాసిన బంతిపూలు, బహుమతి, మొలకలు, ఊగుతున్న ఉయ్యాల, బాల చెలిమి, చేతిరాత వంటి బాల సాహిత్య పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా రచయిత బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. పిల్లలు చిన్నప్పటి నుండే కథలు చదివే అలవాటు చేసుకోవాలన్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ పాఠశాలలకు బాల సాహిత్య పుస్తకాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనిమద్దె సైదులు, గౌతమి, గ్రామ కార్యదర్శి సాయి చరణ్, కోమటిరెడ్డి అరుణ, నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.