నల్లగొండ ప్రతినిధి, జూలై2(నమస్తేతెలంగాణ): అదే దో జిల్లా స్థాయి అధికారులో స్థానిక ప్రజాప్రతినిధులో వేసిన శిలాఫలకం కాదు. ముఖ్యమంత్రితోపాటు కీలక మంత్రులంతా కలిసి వేసిన శిలాఫలకం. అటువంటి శిలాఫలకం నాలుగు రోజులుగా నిర్లక్ష్యంగా నేలపై పడి ఉంది. అయినా ఎవరూ పట్టించుకోలేదంటే ప్రభు త్వం, అధికార యంత్రంగం చిత్తుశుద్ధిపై అనుమానా లు వ్యక్తం అవుతున్నాయి. నల్లగొండ నాగార్జున డిగ్రీ కాలేజీ మైదానంలో గత నెల 28న జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదే మైదానంలో బహిరంగ సభ వేదికకు కొద్దీ దూరంలో రూ.83 కోట్లతో నల్లగొండ వాటర్ సైప్లె స్కీంకు సంబంధించిన ఓ శిలాఫలకం ఏర్పాటు చేశా రు.
దీన్ని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మం త్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారయంత్రాంగం అంతా పాల్గొన్నది. ఇంతవరకు బాగా నే ఉన్నా కార్యక్రమం ముగిసిన వెంటనే లేదా మర్నా డు తాగునీటి స్కీం పనులు ప్రారంభించాల్సిన పానగల్ రిజర్వాయర్ వద్ద ఆ శిలాఫలకాన్ని శాశ్వతంగా అమర్చాల్సి ఉంది. కానీ మంత్రి కోమటిరెడ్డి గానీ, కార్పొరేషన్ పాలకవర్గానికి గానీ, జిల్లా అధికారయంత్రాంగానికి గానీ ఇది పట్టలేదు. సీఎం బహిరంగ సభకు వేసిన షామియానాలు, ఇతర సామగ్రి అంతా సంబంధిత కాంట్రాక్టర్లు తరలించుకు వెళ్లారు.
శిలాఫలకం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు, ఇతర సామాన్లు సైతం తీసుకెళ్లారు. కానీ శిలాఫలకాన్ని మాత్రం అక్క డే వదిలేసి వెళ్లారు. అధికారులెవరూ ఈ శిలాఫలకం వైపు చూసినోళ్లు లేరు. దీంతో శిలాఫలకం నేలపైనే పడిపోయి ఉంది. సోమవారం నుంచి గురువారం సాయంత్రం వరకు నాలుగు రోజుల పాటు శిలాఫల కం అలాగే కళాశాల మైదానంలో పడి ఉంది. స్థానిక వాకర్స్ ద్వారా విషయం తెలుసుకున్న నమస్తే తెలంగాణ ఫొటోలు క్లిక్ మనిపించింది. అదే సమయంలో నేలపై ఉన్న శిలాఫలకం ఫొటోలను, వీడియోలను కొందరు వాకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు. ఇది తెలుసుకున్న అధికారులు వెం టనే అగమేఘాల మీద స్పందించారు. కార్పొరేషన్ సిబ్బందితో కలిసి నల్లగొండ ఆర్డీవో అశోక్‌రెడ్డి కాలేజీకి వచ్చి శిలాఫలకాలను ప్రత్యేక వాహనంలో వేసుకొని పానగల్‌లోని ఇరిగేషన్ కార్యాలయానికి తరలించడం గమనార్హం.
దీనిపై మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయ సిబ్బంది స్పందిస్తూ టెంట్లు తీస్తుంటే శిలాఫలకాలు పడ్డాయని, విషయం తెలిసి వెంటనే మున్సిపల్ అధికారులు వీటిని తీసుకెళ్లి భద్రపరిచారంటూ దిద్దుబాటు చర్యలకు దిగారు. అయితే రాజకీయంగా మా త్రం మరో రకమైన చర్చ మొదలైంది. శిలాఫలకంతో ఏమయ్యేది ఉంది? అసలు నిధులు ఇస్తేగా పనులు జరిగేది… సీఎం నిధులు ఇచ్చేది లేదు… పనులు జరిగేది లేదన్న ధోరణితోనే మంత్రి అనుచరులు, కార్పొరేషన్ పాలకవర్గం శిలాఫలకాన్ని గాలికి వదిలేసి ఉం టారనే పొలిటికల్ సెటైర్లు పేలుతున్నాయి. ఇక ఆ రోజు బహిరంగసభా వేదికపై సీఎంతో పాటు ఆయన వ్యక్తిగత భద్రతాసిబ్బంది ఓవర్ యాక్షన్‌పైనా గుర్రుగా ఉన్న స్థానిక పాలకవర్గం కావాలనే దీన్ని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది.