నల్లగొండ రూరల్, ఆగస్టు 07 : గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, మురుగు కాల్వల చివరలో విధిగా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని నల్లగొండ మండల ఎంపీడీఓ యాకూబ్ నాయక్ సిబ్బందికి సూచించారు. గురువారం నల్లగొండ మండలంలోని జీకే అన్నారం, కాకుల కొండారం, రాములబండ గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలకు స్థలాలను పరిశీలించడంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో పురోగతిని పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. ఆయన వెంట పంచాయతీరాజ్ ఏఈ రమేశ్, పంచాయతీ కార్యదర్శులు యశ్వంత్ సాయి, బైరెడ్డి హరిత, మమత ఉన్నారు.