గరిడేపల్లి, నవంబర్ 25 : పుట్టిన ప్రతి శిశువుకు పూర్తి స్థాయిలో వ్యాధి నిరోధక టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, పిల్లలకు అన్ని రకాల టీకాలు వంద శాతం సకాలంలో ఇవ్వడం ఆరోగ్య విభాగం ప్రధాన బాధ్యత అని సూర్యాపేట జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కోటి రత్నం అన్నారు. మంగళవారం గరిడేపల్లి పీహెచ్‌సీని ఆమె అకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, కోల్డ్‌చైన్ పద్ధతులను సమగ్రంగా పరిశీలించారు. ఆస్పత్రిలోని వ్యాధి నిరోధక టీకాలకు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేశ్, వీసీసీఎం లతీఫ్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.