అమరుల ఆశయాలు స్వరాష్ట్రంలో సాకారం
తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి చేసిన ప్రాణత్యాగం గొప్పదని, ఆయన అమరత్వాన్ని మరువబోమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
- పొడిచేడులో శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి
మోత్కూరు, డిసెంబర్ 3 : తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి చేసిన ప్రాణత్యాగం గొప్పదని, ఆయన అమరత్వాన్ని మరువబోమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 13వ వర్ధంతి సభను మండలంలోని పొడిచేడు గ్రామంలో నిర్వహించారు సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి గ్రామంలోని శ్రీకాంతాచారి విగ్రహానికి, సభావేదిక వద్ద చిత్రపటానికి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీకాంత్ త్యాగం యావత్ దేశ ప్రజలను ఉద్యమానికి మేల్కొల్పిందన్నారు. ఆ త్యాగం వల్లే సీఎం కేసీఆర్ న్యాయకత్వంలోని తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడుతున్నదన్నారు.
అమరుల త్యాగాలను గుర్తించి కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. వారి ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. 2014కు ముందు తెలంగాణ కరువు కాటకాలు, ఆర్థిక ఇబ్బందులు, రైతు ఆత్మహత్యలతో అన్నమో రామచంద్ర అని గోసపడిన స్థితుల నుంచి ప్రస్తుతం భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. రాష్ట్రంలో కనివినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. పొడిచేడులో కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ అమరుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. సభలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు, మున్సిపల్ చైరపర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, ఎంపీపీ రచ్చ కల్పనాలక్ష్మీనర్సింహారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, సర్పంచ్ పేలపుడి మధు, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు బుషిపాక లక్ష్మి, నాయకులు కొండ సోంమల్లు, చిప్పలపల్లి మహేంద్రనాథ్, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, కప్పె వెంకన్న, మల్లం అనిత పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

