నకిరేకల్, జూన్ 06 : నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లిలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. బాలుర ఫైనల్స్‌లో కరీంనగర్, వరంగల్ జిల్లా జట్లు తలపడగా కరీంనగర్ జట్టు గెలుపొంది ప్రథమ స్థానంలో నిలిచింది. వరంగల్ ద్వితీయ, నల్లగొండ తృతియ స్థానాన్నిలో నిలిచాయి. బాలికల ఫైనల్స్ విభాగంలో వరంగల్, ఖమ్మం జట్లు తలపడగా వరంగల్ జట్టు ప్రథమ స్థానాన్నికైవసం చేసుకుంది. ఖమ్మం ద్వితీయ, రంగారెడ్డి తృతియ స్థానంలో నిలిచినట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ ఉస్మాన్, చింతకాయల పుల్లయ్య తెలిపారు.
ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి కె. నర్సిరెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపు ఓటములను పరిగణలోకి తీసుకోకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామమైన మంగళపల్లిలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని, గ్రామస్తులను, క్రీడల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కర్ర వీరారెడ్డి, నకిరేకల్ సర్కిల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ లచ్చిరెడ్డి, కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు బొల్లెద్దు లక్ష్మయ్య, పాపయ్య, ప్రకాశ్‌రావు, పైళ్ల లింగయ్య, లింగారావు, మునీందర్రావు, డాక్టర్ పైళ్ల భరద్వాజ్, సూరజ్‌కుమార్, వంటల ఆనంద్‌బాబు, గ్రామ కార్యదర్శి పల్స రజిత, గ్రామస్తులు పాల్గొన్నారు.