మిర్యాలగూడ, జూలై 11: నాగార్జునసాగర్ ఎడమ కాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాల్లో గత కొంతకాలంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. వీటిల్లోని విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయి. ఎత్తిపోతల పథకాలకు అతిముఖ్యమైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పైన టాప్ తొలగించి లోపల ఉన్న కాపర్ వైరుతో ఉన్న కోర్ ఆయిల్ చోరీకి పాల్పడుతున్నారు. ఎత్తిపోతల పథకాల్లోని మోటర్లు సైతం చోరీకి గురి అవుతున్నాయి. దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో వేములపల్లి గ్రామ పరిధిలో ఎడమ కాల్వపై ఉన్న రెండు ఎల్14 లిఫ్టుల్లోని (400 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు) కోర్ ఆయిల్ చోరీ చేశారు. దీంతో అదే రోజు లిఫ్ట్ అధ్యక్షుడు ప్రణీత్‌రెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంకు తండా గ్రామ పరిధిలోని ఆర్ 5 లిఫ్టులో ఉన్న ఆరు మోటార్లు చోరీకి గురి అయ్యాయి. మిర్యాలగూడ మండలం దొండవారిగూడెం గ్రామ శివారులోని ఎల్ 16 లిఫ్టుకు చెందిన 500 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పైన టాప్ తొలగించి లోపల ఉన్న కోర్ ఆయిల్‌ను చోరీ చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ టాప్ ఓపెన్ చేసి లోపల ఉన్న బరువైన కాపర్ వైరుతో కూడిన కోర్ ఆయిల్ తీయాలంటే కంపల్సరీగా జేసీబీ, క్రేన్, చైన్ బ్లాక్, ఫోర్ వీలర్ వాహనాలు ఉంటేనే చోరీ సాధ్యమవుతుంది. వాటర్ ట్యాంక్ తండా ఆర్ 5 లిఫ్టులో 6 మోటార్లనను, షట్టర్లను తొలగించి చోరీకి పాల్పడడం ఒక ముఠా పనేనని రైతులు అనుమానిస్తున్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉ న్న ఈ రోజుల్లో చోరీకి పాల్పడిన నేరస్తులను పోలీసులు ప ట్టుకోకపోవడం ఏంటని రైతుల ప్రశ్నిస్తున్నారు. ఇలాగే వ దిలేస్తే ఎత్తిపోతల పథకాలను ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు కే బుల్ పైపులు, స్టార్టర్లు ఏవీ మిగలకుండా పోతాయని రై తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడమ కాల్వ కింద ఉ న్న 42 లిఫ్ట్ ఇరిగేషన్లలో కోట్లాది విలువైన ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయని, వరుస చోరీలు ఆందోళనకరంగా మా రాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎత్తిపోతల పథకాల్లో సుమారు రూ.50 లక్షలకు పైగా విలువైన ఎలక్ట్రికల్ సామాన్లు చోరీకి గురైనట్లుగా రైతులు పేరొంటున్నారు. అదేవిధంగా వేములపల్లి గ్రామ పంచాయతీ సమీపంలోని పంచాయతీ ట్రాక్టర్ రెండేళ్ల క్రితం చోరీకి గురైంది. ఇంతవరకు పోలీసులు ట్రాక్టర్ ఆచూకీ తెలుసుకోలేకపోయారని, పోలీసులు ఏం చేస్తున్నారని స్థానికులు ప్ర శ్నిస్తున్నా రు. అదేవిధంగా గత వానకాలంలో మిర్యాలగూడ మండ లం జేత్యా తండా పరిధి లో వరి పొలంలో ఉంచిన ట్రాక్టర్ ధాన్యాన్ని గుర్తు తెలియ ని వ్యక్తులు చోరీ చేశారు.
ఇదే సీజన్లో వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామ శివారులో కాంటా వేసి ఉన్న 60 బస్తాల ధాన్యాన్ని చోరీ చేశా రు. ఈ దొంగలను కూడా ఇంతవరకు పోలీసులు పట్టుకోలేకపోయారని, ఇది ఇలాగే కొనసాగితే వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఎత్తిపోతల పథకాలపై ఎన్ఎస్పీ అధికారుల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. ఎత్తిపోతల పథకాలంటేనే తమకేమీ పట్టదనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కనీసం ఎత్తిపోతల పథకాల్లో ఏమి జరుగుతుందో.. ఏ లిఫ్టులో ఎన్ని మోటర్లు.. ఎన్ని స్టార్టర్లు ఉన్నాయి.. ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని ఉన్నాయనే కనీస పట్టింపు కూడా లేదు. సీజన్ పూర్తికాగానే అధికారులు ఎత్తిపోతల పథకాల వద్దకు వెళ్లి షట్టర్లకు తాళాలు వేసి, అకడ ఉన్న ఎలక్ట్రిక్ సామాన్లు, మోటర్లు, స్టార్టర్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటే బాగుంటుందని రైతుల పేర్కొంటున్నారు.