నిడమనూరు, అక్టోబర్ 23 : నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి ఫీడర్ పరిధిలో 132 కేవీ విద్యుత్ లైన్ 133 కేవీ ఇన్సూలేటర్ విఫలమవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సోమోరిగూడెం చెరువు గుండా వెళ్లే విద్యుత్ స్థంభం ఇన్సూలేటర్ విఫలమైనట్లు ఏఈ శరత్ కుమార్ ఆధ్వర్యంలోని సిబ్బంది సమస్యను గుర్తించింది. దీంతో సిబ్బంది ఇద్దరు గురువారం ప్రాణాలకు తెగించి చెరువు నీటిలో ఈదుకుంటూ వెళ్లి స్తంభం వద్దకు చేరుకున్నారు. కరెంట్ స్తంభం పైకి ఎక్కి మరమ్మతుకు గురైన ఇన్సూలేటర్ను తొలగించి దాని స్థానంలో కొత్తది అమర్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సిబ్బంది సాహసాన్ని అధికారులు, స్థానికులు ప్రశంసించారు.