అర్వపల్లి, అక్టోబర్ 13 : శ్రీరామ్ సాగర్ రెండవ దశకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని, కమ్యూనిస్టుల పోరాట ఫలితమే శ్రీరామ్ సాగర్ రెండవ దశ నిర్మాణమని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు, మండల కార్యదర్శి వజ్జే శ్రీనివాస్ అన్నారు. సోమవారం అర్వపల్లిలో వారు మాట్లాడుతూ.. ఆదివారం తుంగతుర్తిలో జరిగిన రామ్‌రెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ సభలో శ్రీరామ్ సాగర్ రెండవ దశ నిర్మాణానికి ఆర్డీఆర్ పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై అభ్యంతరకరం అన్నారు.
కమ్యూనిస్టుల దశాబ్దాల పోరాటాల ఫలితంగా ముఖ్యంగా సిపిఎం పార్టీ భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో ఫోరాటాల ఫలితంగానే నిర్మాణం జరిగిందని, శ్రీరామ్ సాగర్ రెండో దశ నిర్మాణ పోరాటంలో ఎలాంటి సంబంధం లేని ఆర్డీఆర్ పేరు పెట్టడం దేనికి సంకేతం అని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రెండవ దశ కాల్వకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుమార్, వెంకన్న, విజయ్ కుమార్, అబ్దుల్, నరేందర్, వీరస్వామి, వెంకటేశ్, భిక్షం, వీరస్వామి, వీరయ్య, ఆవులయ్య, లింగయ్య, పాల్గొన్నారు.