నీలగిరి, ఫిబ్రవరి 05 : నార్కట్‌పల్లి మండలం ఔరవాణీ గ్రామ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం రాత్రి బీఆర్ఎస్ గ్రామ శాఖ సమావేశం జరుగగా నాయకులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామంలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయనున్నట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ ముప్పిడి ఎల్లయ్య, మాజీ సర్పంచ్ మాదగోని నర్సింహ్మ, బీఆర్ఎస్ నాయకులు కల్లూరి బాలరాజు, నీరుడు షణ్ముఖ్ రెడ్డి, కడారి రాజు పాల్గొన్నారు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహిస్తున్న ఐదుగురు నాయకులను బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 4వ డివిజన్ నుండి బొజ్జ సైదులు, 14వ డివిజన్ నుండి బీపంగి కిరణ్, 19వ డివిజన్ నుండి కొంగర సైదులు, 35వ డివిజన్ నుండి బిలువేరు నాగరాజు, 37వ డివిజన్ నుండి వీరమళ్ల భాస్కర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.