నల్లగొండ, నవంబర్ 27 : నల్లగొండ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన బాలగోని శ్రీనివాస్ గౌడ్ (43) బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెల్సిన కాలనీవాసులు, పెద్దలు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రీనివాస్ మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీనివాస్ పార్ధీవదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి డొనేట్ చేయడానికి అంగీకరింపజేశారు. అనంతరం లయన్స్ క్లబ్ అఫ్ ఐకాన్ సహకారంతో డాక్టర్ పుల్లారావు ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీ బాధ్యులను సంప్రదించారు. పార్థీవ దేహం స్వీకరణకు అంగీకరించడంతో ప్రత్యేక అంబులెన్సులో తరలించారు. మెడికల్ కాలేజీలోని అనాటమీ విభాగంలో హెచ్ఓడి ప్రొఫెసర్, డాక్టర్ పుష్పమాల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమీర అఫ్రోజ్ బృందం సమక్షంలో శ్రీనివాస్ పార్దివదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించారు.
ఈ సందర్బంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ కుటుంబ సభ్యులను, సహకరించిన కాలనీ పెద్దలను అభినందించారు. తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయి తీవ్ర బాధ, విచారంలో మునిగి ఉన్న అత్యంత విషాదకర పరిస్థితుల్లోనూ పార్ధీవదేహాన్ని డొనేట్ చేయడానికి అంగీకరించిన శ్రీనివాస్ గౌడ్ తల్లి శకుంతల, అక్కబావలు అపర్ణ దశరథ, చెల్లలు విజయలక్ష్మి, అంబాల సత్యనారాయణ, ఇతర కుటుంబం సభ్యులను కాలనీ పెద్దలు, పలువురు ప్రముఖులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, కాలనీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుట్టెడ్డి వీరారెడ్డి, పంతులు శ్రీనివాస్, కాలనీ పెద్దలు సింగం రామ్మోహన్, సోమగాని శంకర్ గౌడ్, అరుకల శంకర్ గౌడ్, సీహెచ్ శ్రీరాములు, ఇమ్మడిశెట్టి ఉదయకుమార్, మేడ మోహన్ రెడ్డి, మర్రి మహేందర్ రెడ్డి, ముప్పరేవన్ రెడ్డి, ఎం.వెంకటేశ్వర్లు, వీరమళ్ల వెంకటరమణ, ప్రేమ్ మోహన్, పానగంటి యాదగిరిగౌడ్, శంకర్ గౌడ్, శ్రీనారాయణ, నర్సింహ, అంజయ్య, పురుషోత్తంరెడ్డి, అబ్బగోని కవిత, డాక్టర్ శోభారాణి, కె.వీణ, బి.లీలావతి, గోవిందమ్మ, రజినీ, ఎం.అలివేలు పాల్గొన్నారు.

Nalgonda : శ్రీనివాస్ గౌడ్ పార్థీవ దేహం నల్లగొండ మెడికల్ కాలేజీకి అప్పగింత