మిర్యాలగూడ టౌన్, మార్చి 19 : శ్రీనిధి బకాయిలను ఈ నెల 31 లోగా పూర్తిగా చెల్లించేలా రిసోర్స్ పర్సన్స్ చొరవ చూపాలని మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ఎండీ.యూసుఫ్ అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు మెప్మా రిసోర్స్ పర్సన్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనిధి జెడ్ ఎం అనంత కిశోర్, ఆర్ ఎం శ్రీలేఖతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. శ్రీనిధి బకాయిలను వెంటనే రికవరీ చేయాలని, ఎవరైతే వారి వ్యక్తిగత అవసరాలకు నిధులను వాడుకున్నట్లయితే వారి మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా ప్రాపర్టీ టాక్స్, ఎల్ఆర్ఎస్ ను 100% వసూలు చేయాలన్నారు. శ్రీనిధి నుంచి ఇప్పటివరకు రూ.16.84 కోట్ల రుణాలు ఇవ్వగా రూ.2.72 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. కొత్త సంఘాలు కచ్చితంగా వారి టార్గెట్ ను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మెప్మా టిఎంసి బక్కయ్య, సిఓ వెంకటేశ్వర్లు, సతీశ్, రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.
Srinidhi loans : శ్రీనిధి బకాయిలను పూర్తిగా రికవరీ చేయాలి : మున్సిపల్ కమిషనర్ యూసుఫ్