రామగిరి, ఆగస్టు 15 : తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి జయంతిని నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నల్లగొండలోని గడియారం సెంటర్లో గల శ్రీకాంతాచారి విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మను, మయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, విగ్రహ వ్యవస్థాపకుడు గుంటోజు వెంకటాచారి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి ఉద్యమ స్ఫూర్తి, త్యాగం చిరస్మరణీయమన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీకాంతాచారి స్ఫూర్తితో స్వరాష్ట్ర అభ్యున్నతిలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పోలోజు మదనాచారి, శివయ్య, బైరోజు చంద్రశేఖర్, విశ్వనాథుల కొండయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.