గరుడ వాహనంపై ఊరేగిన స్వామివారు.. గుట్టలో వైభవంగా నృసింహస్వామి జయంతోత్సవాలు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి స్వయంభూ ప్రధానాలయంలో నృసింహస్వామివారి జయంతోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
యాదగిరిగుట్ట, ఏప్రిల్28: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి స్వయంభూ ప్రధానాలయంలో నృసింహస్వామివారి జయంతోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన మంగళవారం స్వామివారి అలంకార సేవతో యాగశాల ప్రవేశం జరిగింది. యాగశాలలో ద్వారా తోరణ పూజ, మూర్తికుంబారాధన, చతుస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన, గరుడ మూల మంత్ర హోమాలు నిర్వహించి నిత్యపూర్ణాహుతి వేడుకలను ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యాజ్ఞిక బృందం, అర్చకులు, వేదపండితులు, పారాయణికుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.
సాయంత్రం స్వామివారి ప్రధానాలయంలో నిత్యారాధన చేపట్టారు. జయంతోత్సవాల్లో భాగంగా సాయం ఆరాధన, నిత్యహవనం, లక్ష్మీనృసింహ సుదర్శన మూలమంత్ర హవనం, నిత్యపూర్ణాహుతి కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. గరుడ వాహనంపై పరవాసు దేవ అలంకార సేవలో స్వామివారిని అలంకరించి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు.
అలాగే పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్, డీఈవో నవీన్‌కుమార్, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, ముఖ్య అర్చకులు, ఉప ప్రధానార్చకులు, ఆలయ ఏఈవో, పర్యవేక్షకులు, అర్చక బృందం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

