రామగిరి, ఆగస్టు 11 : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని నల్లగొండ జిల్లా ప్రధాన జడ్జి ఎం.నాగరాజు అన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ నల్లగొండ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యాయవాదులకు స్థానిక మేకల అభినవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిరంతరం బిజీగా ఉండే న్యాయవాదులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యాయవాదులకు క్యారమ్స్, చెస్, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఇండోర్, ఔట్డోర్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి సంపూర్ణ ఆనంద్, కార్యదర్శి మంద నగేశ్, కోశాధికారి బరిగల నగేశ్, జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వీరబాబు, న్యాయవాదులు పాల్గొన్నారు.