కోదాడ, మార్చి 17 : సూర్యాపేట జిల్లా కోదాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి విశ్రాంత ఉద్యోగుల క్రీడా, సాహిత్య, సాంస్కృతిక పోటీలు తగ్గేదేలే అన్నట్లుగా కొనసాగుతున్నాయి. ఈ పోటీలు ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. సోమవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియం, మైదానంలో రసవత్తరంగా కొనసాగుతున్న క్రీడా, సాంస్కృతిక పోటీలను వారు పర్యవేక్షించి మాట్లాడారు. కోదాడలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు నిర్వహించడం చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్నారు.
Retired Employees Sports : ఆరుపదులు దాటినా తగ్గేదేలే.. ఉత్సాహభరితంగా విశ్రాంత ఉద్యోగుల క్రీడా పోటీలు
రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుండి విశ్రాంత ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చినట్లు తెలిపారు. క్రీడలు శారీరక వ్యాయామం, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. క్యారమ్స్, చెస్, టెన్నికాయిట్, షటిల్, నడక పోటీలు సెమీఫైనల్ దశకు చేరుకున్నాయి . మంగళవారం మధ్యాహ్నం వరకు ఫైనల్స్ ముగించుకుని బహుమతి ప్రధానోత్స కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతిభకు వయస్సు అడ్డుకాదని క్రీడల్లో విశ్రాంత ఉద్యోగులు ప్రతిభను కనబరుస్తూ క్రీడాభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుదర్శన్ రెడ్డి, బొల్లు రాంబాబు, యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, అక్కిరాజు వెంకట్రావు, విద్యాసాగర్‌రావు, భ్రమరాంబ, రఘు, ఓరుగంటి రవి పాల్గొన్నారు.