బీబీనగర్, మార్చి 28 : మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో స్పైన్ ఎండోస్కోపిక్ సేవలు ప్రారంభించారు. శుక్రవారం వెన్నముక నొప్పితో బాధపడుతున్న రోగికి చికిత్స అందించారు. ఈ సందర్భంగా కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ సయ్యద్ ఇఫ్తేకర్, ఆర్థోపెడిక్స్ విభాగం అధిపతి డాక్టర్ మహేశ్వర్ లకిరెడ్డి మాట్లాడుతూ బీబీనగర్ ఎయిమ్స్ వెన్నెముక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రపంచ స్థాయి చికిత్సను అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందుకు అనుగణంగా శస్త్రచికిత్సను ప్రారంభించామని తెలిపారు. ఎండోసోప్ సహాయంతో హెర్నియేటెడ్ డిస్లు (స్లిప్ డిస్లు), వెన్నెముక స్టెనోసిస్, దీర్ఘకాలిక వెన్నునొప్పి వంటి పరిస్థితులకు చిన్న కోతల ద్వారా చికిత్స చేయడానికి అనుమతిస్తుందని చెప్పారు. ఈ సాంకేతికత సాంప్రదాయ వెన్నెముక శస్త్రచికిత్సలతో పోలిస్తే ఈ శస్త్ర చికిత్స గాయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, దీని వల్ల తకువ రక్త నష్టం, శస్త్రచికిత్స అనంతరం రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు.