మునుగోడు, ఆగస్టు 30 : మునుగోడు మండల కేంద్రంలోని భక్త మార్కండేయ దేవాలయానికి మునుగోడు మాజీ కో ఆప్షన్ సభ్యుడు పాలకూరి నరసింహ గౌడ్, రమాదేవి దంపతులు రూ.50 వేల విలువైన యాంపిల్ వైర్, సౌండ్ సిస్టం బాక్సులు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులను దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు కొంగరి కృపానంద్, కార్యదర్శి పగిడిమర్రి ప్రభాకర్, ప్రచార కార్యదర్శి రావిరాల కుమారస్వామి, పద్మశాలి సంఘం కార్యదర్శి మిరియాల వెంకటేశం, ఆలయ అర్చకుడు తిరందాసు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.