చివ్వెంల, జూలై 12 : చివ్వెంల మండలం మోదిన్‌పురం శివారులో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఆరు టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మహేశ్వర్ శనివారం తెలిపారు. గత కొన్ని రోజులుగా మోదిన్‌పురం గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పీ కాల్వ పక్కన జేసీబీలతో తవ్వకాలు చేస్తూ అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఇచ్చిన రైడ్ చేసినట్లు చెప్పారు. మట్టిని తరలిస్తున్న ఆరు టిప్పర్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. టిప్పర్లు మట్టి లోడుతో జాతీయ రహదారి 65పై దురాజ్‌పల్లి వద్ద వ్యతిరేక దిశలో సూర్యాపేట జిల్లా కేంద్రం వైపు వాహనదారులకు ఇబ్బందులు కలిగించేలా ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. వాహన యజమానులు నల్లకుంట్ల సత్యం, గుండాల సురేశ్, జోగు నవీన్, ఆరె లింగస్వామి, జాల లింగరాజు, ఆరె సైదులు, ఎల్లుట్ల లింగస్వామిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.