గరిడేపల్లి, మార్చి 20 : గరిడేపల్లి మండలంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న లో వోల్టేజీ సమస్య పరిష్కారానికి కీలకమైన అడుగు పడింది. సూర్యాపేట ఎస్ఈ శ్రీనివాస్ శుక్రవారం మండలంలోని రాయినిగూడెం గ్రామంలో ప్రతిపాదిత సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని రాయినిగూడెం, ముత్యాల నగర్, కాల్వపల్లి, సర్వారం, కాచవారిగూడెం, లింగగిరి గ్రామాల్లో తీవ్రంగా ఉన్న లో వోల్టేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయినిగూడెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించినట్లు ఆయన తెలిపారు. సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే పరిసర గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చి రైతులు, గృహ వినియోగదారులకు పెద్ద ఊరట లభించనుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండు రామాంజి గౌడ్, ఏఈ గన్న సాయికృష్ణ, పంచాయతీ సెక్రటరీ సునీత, ఏఎల్ఎం రాజు పాల్గొన్నారు.