చిట్యాల, జులై 09 : ఆర్గానిక్ కూరగాయల మార్కెటింగ్ కోసం చిట్యాల శివారులో గల ప్రభుత్వ భూమిని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం పరిశీలించారు. చిట్యాలలోని రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 471లో గల 20 గుంటల భూమిని ఆమె పరిశీలించారు. జిల్లా పరిధిలో రైతులు పండించిన ఆర్గానిక్ కూరగాయల మార్కెటింగ్ కోసం రైతు కిసాన్ బజార్ ఏర్పాటు చేయడానికి సంబంధిత స్థలం అనుకూలంగా ఉన్నది, లేనిది ఆమె పరిశీలించి, ఆ భూమికి సంబంధించిన వివరాలను తాసీల్దార్ కృష్ణను ఆడిగి తెలుసుకున్నారు.