కోదాడ, మే 01 : కార్మికుల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే శ్రమశక్తి అవార్డు కోదాడ పట్టణానికి చెందిన కందిబండ వెంకటేశ్వరరావు పొందారు. విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు గత 30 సంవత్సరాలుగా యూనియన్ లో పట్టణ స్థాయి నుండి రాష్ట్రస్థాయిలో వివిధ హోదాలలో పనిచేస్తూ కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందుంటూ కార్మికుల మన్ననలను పొందాడు. 1991లో విద్యుత్ శాఖలో ఉద్యోగాన్ని పొందిన వెంకటేశ్వరరావు గత 35 సంవత్సరాలుగా తోటి కార్మికులు, క్రింది స్థాయి కార్మికుల సంక్షేమానికి కృషి చేయటం వల్ల శుక్రవారం హైదరాబాద్ రవీంద్ర భారతీలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా శ్రమశక్తి అవార్డును పొందినట్లు ఆయన తెలిపారు. అవార్డు గ్రహీతను మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, పీసీసీ డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు, ఆవోప జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రమేష్, పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్స్ నాయకులు, బాధ్యులు అభినందించారు.