కట్టంగూర్, నవంబర్ 12 : నల్లగొండ రెవెన్యూ డివిజన్ స్థాయి వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం కార్యదర్శిగా కట్టంగూర్ హెచ్డబ్ల్యూఓ గుజ్జుల శంకర్ రెడ్డి ఎన్నికయ్యారు. బుధవారం నల్లగొండలో టీఎన్ఓ అధ్యక్షుడు నాగిళ్ల మురళి, మాజీ అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, కార్యదర్శి శేఖర్ రెడ్డి, హెచ్డబ్ల్యూఓ యూనియన్ అధ్యక్షుడు రనదివే సమక్షంలో జరిగిన డివిజన్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ మసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియమాకానికి సహకరించిన సంఘం నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.