కట్టంగూర్, అక్టోబర్ 01 : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని షమీ శమయతే పాపం.. షమీ శత్రు వినాశనం.. అర్జునస్య ధనుర్ధారి.. రామస్య ప్రియ దర్శనం అని ముద్రించిన కుటుంబ సభ్యుల చిరునామాతో కూడిన పత్రాలను బుధవారం కట్టంగూర్‌లో లయన్స్ క్లబ్ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు చిక్కు శేఖర్ మాట్లాడుతూ.. దాత సహకారంతో ముద్రించిన రెండు వేల కరపత్రాలను మండల వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరపత్రాల దాత కటికం రాములు గౌడ్, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు రెడ్డిపల్లి సాగర్, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి పోగుల రాములుగౌడ్, సభ్యులు కడవేరు మల్లికార్జున్, కల్లూరి వెంకన్న, బొడ్డుపల్లి వెంకన్న పాల్గొన్నారు.