భువనగిరి అర్బన్, మే 3 : భువనగిరి పట్టణంలోని రాంనగర్ కాలనీవాసులు 24గంటలపాటు అంధకారంలో గడిపారు. శుక్రవారం రాత్రి 9నుంచి శనివారం రాత్రి 8:30 గంటల వరకు విద్యుత్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండాకాలం కావడం, ఉబ్బరింత ఎక్కువగా ఉండడంతో చిన్నారులు తట్టుకోలేక ఉకిరిబికిరి అయ్యారు. దాంతో చెట్ల కింద సేద తీరాల్సి వచ్చింది.
సమస్యను పరిషరించి వెంటనే విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు శనివారం రాత్రి భువనగిరి – నల్లగొండ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో స్పందించిన అధికారులు ధర్నా వద్దకు వచ్చి సమస్యను పరిషరిస్తామని చెప్పారు. అయినా విరమించలేదు. దాంతో చేసేదేమీలేక కాలనీలోని విద్యుత్ స్తంభాలను పరిశీలించారు.
శుక్రవారం రాత్రి ఈదురు గాలులకు చెట్టు కొమ్మ విరిగి తీగలపై పడడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. సమస్యను వెంటనే పరిషరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో కాలనీ ప్రజలు ధర్నా విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్‌కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శివకుమార్, అంజద్, రషీద్, సైదులు, కాలనీవాసులు
పాల్గొన్నారు.